Jagtial: గౌరపూర్లో నూతన సబ్స్టేషన్ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
Jagtial: జగిత్యాల జిల్లా గౌరపూర్లో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు.
Jagtial: గౌరపూర్లో నూతన సబ్స్టేషన్ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండలం గౌరపూర్ గ్రామంలో నూతన 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం భూమి పూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేయడం. పారిశ్రామిక మరియు గృహ అవసరాలకు అంతరాయం లేకుండా సేవలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
గౌరపూర్ గ్రామంలో ఏర్పాటు కానున్న ఈ 33/11 కేవీ సబ్స్టేషన్ ద్వారా పరిసర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సేవలు అందనున్నాయని, ముఖ్యంగా రైతులకు సాగునీటి పంపుసెట్ల నిర్వహణలో ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




