Karimnagar: వికలాంగులకు మోటార్ సైకిళ్లను అందజేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
Karimnagar: చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో 67 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.
Karimnagar: వికలాంగులకు మోటార్ సైకిళ్లను అందజేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
కరీంనగర్ జిల్లా: చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం 67 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి/షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు వికలాంగులకు మోటర్ సైకిల్ (టూ వీలర్)లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలు ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే వికలాంగుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న టూ వీలర్లు వారి దైనందిన జీవితంలో స్వయం ఆధారితంగా నిలబడేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ప్రభుత్వం ప్రతి వర్గ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.




