Jagtial: గాంధీనగర్ వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే!

Jagtial: జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై గాంధీనగర్ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ANAND, JAGITYAL
Published on: 10 Nov 2026 12:04 PM IST
Jagtial
X

Jagtial: గాంధీనగర్ వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే!

Jagtial: నిజామాబాద్ జాతీయ రహదారిపై గాంధీనగర్ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. రాయికల్ మండల పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో పనులను తనిఖీ చేసిన ఆయన, నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.

అలాగే, పట్టణ తాగునీటి పైప్‌లైన్ దెబ్బతిన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సీనియర్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్ స్వప్న గిరిధర్, సేవాదళ్ కార్యదర్శి ముకేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL