Karimnagar: వారం రోజులు గడువు.. సాగునీరు ఇవ్వకపోతే మహా ధర్నా తప్పదు - గంగుల!

Karimnagar: కరీంనగర్ నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడిపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై ఆగ్రహం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 18 Jun 2026 1:17 PM IST
Karimnagar
X

Karimnagar: వారం రోజులు గడువు.. సాగునీరు ఇవ్వకపోతే మహా ధర్నా తప్పదు - గంగుల!

కరీంనగర్ : మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీటిని వరద కాలువ ద్వారా తరలించి కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు సాగునీటిని ఏడు రోజుల్లోగా అందించాలని, లేనిపక్షంలో ఆచంపల్లి వద్ద రైతులతో మహాధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గంగుల హెచ్చరించారు.

కరీంనగర్ నియోజకవర్గం లోని బద్దిపల్లి గ్రామంలో రైతుల ఆహ్వానం మేరకు మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంట పొలాలతోపాటు చెరువులను పరిశీలించారు. కొత్తపల్లి మండలం, కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు సాగునీరు లేదని చుక్క వర్షం లేక బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు.

రైతులందరం నార్లు వేసామని వారం రోజుల లోపు నీరు అందకపోతే నార్లు ఎండిపోయి రైతులు రోడ్డు రోడ్డునపడే అవకాశం ఉందని ఎమ్మెల్యే కు మొరపెట్టుకున్నారు. రైతులు అధైర్య పడవద్దు అని వారికి అండగా ఉంటానని నీళ్లు వచ్చేంతవరకు కొట్లాడుతానని వారికి హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ

టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాలేశ్వరం నీటిని వరద కాలు ద్వారా మిడ్ మానేరు కు తరలించామని. వరద కాలువ పైన ఆచంపల్లి దగ్గర తూము ఏర్పాటు చేసి. మండలంలోని నాగుల మల్యాల, బద్దిపెళ్లి ఎలగందుల, బావు పేట కమాన్పూర్, కొండాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల చెరువులను నింపి, పంటకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని. అదేవిధంగా చెరువుల నింపి అటు మత్స్యకారులకు మంచి సంపద పెంచామని గుర్తు చేశారు.

కానీ ప్రస్తుతం రోహిణి కార్తి అయిపోయిందని రైతులందరూ నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారని కానీ ఇటు వాతావరణ పరిస్థితులు దృష్ట్యా చుక్క వర్షం పడకపోవడం, అటు మేడిగడ్డ ద్వారా వరద కాలువకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారని తెలిపారు.

వారికి సకాలంలో నీరు అందిస్తేనే నార్లు ఎండిపోకుండా ఉంటుందన్నారు. ఓవైపు భూగర్భ జలాలు పడిపోయి బావులలో నీరు లేకుండా పోయిందని.. ప్రస్తుతం రైతులకు కేవలం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరును అందిస్తే మాత్రమే.. రైతుల పంటలకు ఇబ్బంది ఉండదని వారు తెలిపారు.

దాంతోపాటు గత 15 20 సంవత్సరాల క్రితం వరద కాలువ నుండి లెఫ్ట్ కెనాల్ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టారని కానీ అవి మభ్యంతరంగానే ఆగిపోయాయని. మళ్లీ లెఫ్ట్ కెనాల్ పనులను ప్రారంభించి వాడుకలోకి తీసుకురావాలని తద్వారా శ్రీరాములపల్లి గ్రామానికి కూడా సాగునీరు అందుతుందన్నారు. లెఫ్ట్ కెనాల్ ను పునరుద్ధరించకపోతే తామే స్వయంగా రైతులతో కలిసి లెఫ్ట్ కెనాల్ ను ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వారం రోజుల్లోగా వరద కాల ద్వారా చెరువులను నింపాలని, లేనిపక్షంలో రైతు రైతులతో కలిసి మహా ధర్నా నిర్వహించి రైతు ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన రైతులు భారసా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story