Karimnagar: అర్హులకే డబుల్ ఇళ్లు ఇవ్వాలంటూ కలెక్టరేట్ మెట్లు ఎక్కిన గంగుల

Karimnagar: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ చిత్త మిశ్రాను కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 20 July 2026 10:56 PM IST
Karimnagar
X

Karimnagar: అర్హులకే డబుల్ ఇళ్లు ఇవ్వాలంటూ కలెక్టరేట్ మెట్లు ఎక్కిన గంగుల

కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్దిదారులకు పారదర్శకంగా కేటాయించాలని నేడు జిల్లా కలెక్టర్ చిత్తమిశ్రా ని కలసి వారికీ వినతిపత్రం అందించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం అనేది నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే కీలకమైన కార్యక్రమమని, దీనిని ఎంతో బాధ్యతాయుతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేటాయింపు ప్రక్రియలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా, పూర్తిగా నిబంధనల ప్రకారం అర్హులైన వారికే ఇండ్లు దక్కేలా చూడాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story