Karimnagar: రేకుర్తిలో ₹20 లక్షలతో వాటర్ పైప్‌లైన్ పనులు ప్రారంభం
Karimnagar: కరీంనగర్ రేకుర్తి వద్ద ₹20 లక్షలతో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల, మేయర్ శ్రీనివాస్ భూమి పూజ చేశారు.
Karimnagar: రేకుర్తిలో ₹20 లక్షలతో వాటర్ పైప్‌లైన్ పనులు ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్లో గల రేకుర్తి చౌరస్తా వద్ద మంచినీటి పైపు లైను నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
ఈ సందర్భంగా మేయర్, కరీంనగర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు సుమారు 20 లక్షల రూపాయలను వెచ్చించి త్రాగునీటి పైపులైను నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు.
విలీన గ్రామాలతో పాటు నగర అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం సాధారణ నిధులతో పాటు ఇతర నిధులు వెచ్చించి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రోడ్లు, ఏర్పాటు చేయడం కనీస అవసరమని వాటిని ముందస్తుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
త్రాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడడం గుర్తించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న పైపులతోపాటు ట్యాంకులు నిర్మించి 24 గంటలు నీరు అందించడానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్ తో పాటు, మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్, బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు, బిజెపి కార్పొరేటర్లు, స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.




