Thimmapur: నుస్తులాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే!
Thimmapur: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.
Thimmapur: నుస్తులాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే!
Thimmapur: తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య పటేల్ తో కలిసి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులకు ధాన్యం విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారి రమేష్, ఉప సర్పంచ్ గోగూరి నరసింహారెడ్డి, మాజీ ఎంపిటిసి కొత్త తిరుపతిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు బుధారపు శ్రీనివాస్,సర్పంచ్ జినుక మారుతి, చింతం చంద్రయ్య , ఎలుక రాజు, అనిల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




