Thimmapur: ఎంపీడీవో ఆఫీస్‌లో లబ్ధిదారులకు రూ.59 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

Thimmapur: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కింద రూ.59 లక్షల చెక్కులను పంపిణీ చేసి, బీఆర్ఎస్ అవినీతిపై మండిపడ్డారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 29 July 2026 7:06 PM IST
Thimmapur
X

Thimmapur: ఎంపీడీవో ఆఫీస్‌లో లబ్ధిదారులకు రూ.59 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

తిమ్మాపూర్: తిమ్మాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 27వ విడతగా 99 మందికి రూ.31 లక్షల 92 వేల సీఎం సహాయనిధి చెక్కులను, 27 మందికి రూ. 27,03, కళ్యాణ లక్ష్మీ, షాధీ ముభారక్ చెక్కులను లబ్ధిదారులకు ఈరోజు అందించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం పని చేస్తుందని, రుణ భారం తగ్గించడానికి,ఆర్థిక భారం పడకుండా చూస్తుందన్నారు. అనేక పథకాలను తీసుకొచ్చి ఎంతో మందికి అండగా నిలుస్తుందన్నారు. ఏడాది కాలంలో 90శాతం మందికి రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. అధిక దిగుబడి వచ్చినా ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు అకౌంట్లలో వేసిందని తెలిపారు.

పేదలంటే సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ అని, పేదల కోసమే పథకాలు తీసుకొచ్చాడని, రాష్ట్రంలో గుడిసె లేని తెలంగాణ ను చూడాలనేది సీఎం కళ అన్నారు. అందుకే అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నాడని తెలిపారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ కల్సి ఉండి ఒక్క ఇల్లు తీసుకురాలేదని, ఇపుడు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా కేంద్రం నుండి ఇండ్లు తీసుకువచ్చే ప్రయత్నం సీఎం చేస్తున్నట్లు తెలిపారు.

ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లను తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఇండ్లు ఇచ్చామని,తమ ప్రభుత్వ పథకాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంను గుర్తించి అండగా ఉండాలని కోరారు. కేసీఆర్ చేసిన అన్యాయాలను చూసి తమను గెలిపించినట్లు, కట్టిన కొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లను సైతం బీఆర్ఎస్ వారు అమ్ముకున్నారని ఆరోపించారు. అయినా ఇప్పటికీ సిగ్గులేకుండా విమర్శిస్తున్నారు.

స్థానికేతరుడని ప్రజలు బుద్ది చెబితే వెళ్లిపోయి అప్పుడప్పుడు వీడియోలు పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడం చేస్తున్న వ్యక్తికి రాబోవు రోజుల్లో మరోసారి పాతాలానికి తొక్కాలని కోరారు. ప్రతిపక్షాలు బురదలాంటి వారని, అందులో ఏది వేసినా మనమీదనే పడుతుందని, అందుకే తాము మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు మరోసారి బొక్కలు ఇరగతన్ని మళ్లీ పంపిస్తారని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని అయన పరిశీలించి భవనం మరమ్మతు కోసం తాను స్పందించి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పవన్ కుమార్, తహశీల్దార్ కర్ర శ్రీనివాస రెడ్డి, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర, సొసైటీల చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస రావు,దావు సంపత్ రెడ్డి,గొట్టిముక్కుల సంపత్ రెడ్డి,శ్రీ గిరి రంగారావు,జినుక మారుతీ, పొన్నాల సంపత్,కొత్త తిరుపతి రెడ్డి,పోలు రమేష్ , రాము, బండారి పల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story