Thimmapur: ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ప్రజా భవన్‌లో మానకొండూరు నియోజకవర్గ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 18 Jun 2026 7:45 PM IST
Thimmapur
X

Thimmapur: ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే ప్రజా భవన్ లో మానకొండూరు నియోజకవర్గం లోని మానకొండూర్, తిమ్మాపూర్,శంకరపట్నం, గన్నేరువరం మండలాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇళ్ల ప్రోసిడింగ్,

పత్రాలను ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడిసెలు, రేకుల ఇల్లు కలిగిన లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కలను నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ పాలకులు చేయలేని ఇల్లు ఇవ్వలేని పరిస్థితి కళ్లారా చూశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే దిశగా పనిచేసే చూపిస్తామని భరోసా ఇచ్చారు.కొన్ని మండలాలలో సాంకేతిక లోపాల వలన లబ్ధిదారులకు త్వరలో ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తామన్నారు.

ప్రోసిడింగ్ తీసుకున్న లబ్ధిదారులు ముగ్గు పోసి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, వివిధ మండలాల ఎంపీడీవోలు, తాసిల్దారులు, సర్పంచులు, ఏఈ హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story