Choppadandi: చొప్పదండిలో వివిధ కుల సంఘాల భవనాలకు నిధుల మంజూరు

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 24 May 2026 3:46 PM IST
Choppadandi
X

Choppadandi: చొప్పదండిలో వివిధ కుల సంఘాల భవనాలకు నిధుల మంజూరు

Choppadandi: కరీంనగర్ జిల్లాచొప్పదండి పట్టణ కేంద్రంలోని రెడ్డి సంఘం, మున్నూరుకాపు సంఘం, గౌడ సంఘం భవనాల మిగులు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించగా, ఆర్నకొండ గ్రామంలో నాయీ బ్రాహ్మణ సంఘం నూతన భవన నిర్మాణానికి కూడా రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. సంఘ భవనాలు సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్థానిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవనాల నిర్మాణం పూర్తయితే సంఘ కార్యకలాపాలు మరింత సక్రమంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story