Mutyampeta: ముత్యంపేటలో ఇందిరమ్మ గృహ ప్రారంభోత్సవం.. లబ్ధిదారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం!
Mutyampeta: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో మల్యాల మమత-వినోద్ దంపతుల నూతన గృహప్రవేశానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు.
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారురాలు మల్యాల మమత - వినోద్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి నూతన వస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




