Malyala: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మల్యాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శ్రీకారం!

Malyala: జగిత్యాల జిల్లా మల్యాలలో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం పర్యటన. కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కుల పంపిణీతో పాటు అంగన్‌వాడీలకు ఉచిత మొబైల్ ఫోన్ల అందజేత. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్‌కు శంకుస్థాపన.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 23 April 2026 10:08 AM IST
Malyala: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మల్యాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శ్రీకారం!
X

మల్యాల (జగిత్యాల): జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే మల్యాల, కోడిమ్యాల మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం తరపున అందించే ఉచిత మొబైల్ ఫోన్లను అందజేశారు.

గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందించే రూ.5 లక్షల నగదు ప్రొసీడింగ్స్‌ను అందించి వారికి ధైర్యం చెప్పారు.

అనంతరం మల్యాల మండల శివారులో రూ.40 లక్షల నిధులతో ఏర్పాటు చేయనున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్‌కు శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story