Sircilla: ఇందిరమ్మ ఇల్లు రెడీ.. ప్రారంభించిన మేడిపల్లి సత్యం!
Sircilla: బోయిన్‌పల్లి మండలం దుండ్రపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు.
Sircilla: ఇందిరమ్మ ఇల్లు రెడీ.. ప్రారంభించిన మేడిపల్లి సత్యం!
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్‌పల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు కోడం మంజుల – శ్రీనివాస్ దంపతుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




