Karimnagar: గంగాధరలో రైతు సంక్షేమ బాట.. కొత్త ధాన్యం కేంద్రాలతో ఊరట!
Karimnagar: గంగాధర మండలంలో నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Karimnagar: గంగాధరలో రైతు సంక్షేమ బాట.. కొత్త ధాన్యం కేంద్రాలతో ఊరట!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం హిమ్మత్ నగర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే బూరుగుపల్లి గ్రామంలో సీడీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సభ్యులు, సీడీఎంఎస్ ప్రతినిధులు, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




