Gangadhara: గంగాధరలో అకాల వర్షాల బీభత్సం: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
Gangadhara: గంగాధర మండలంలో అకాల వర్షాల బీభత్సం. రాత్రి వేళలోనే దెబ్బతిన్న ఇళ్లు, తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Gangadhara: గంగాధరలో అకాల వర్షాల బీభత్సం: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలంలోని గంగాధర, లక్ష్మీదేవిపల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం మరియు ఈదురుగాలుల కారణంగా భారీ నష్టం సంభవించింది. పలుచోట్ల ఇళ్లు దెబ్బతినగా, వ్యవసాయ కల్లాలు, ధాన్యం నిల్వలు కూడా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అర్ధరాత్రి వరకు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వర్షాల వల్ల నష్టపోయిన ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే వ్యవసాయ కల్లాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు.
Next Story




