Karimnagar: కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేడిపల్లి

Karimnagar: మేడే (కార్మిక దినోత్సవం) సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar
Updated on: 1 May 2026 1:15 PM IST
Karimnagar
X

Karimnagar: కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేడిపల్లి

కరీంనగర్: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలకు మేడే ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని, వారి కష్టంతోనే సమాజం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ప్రతి రంగంలోనూ కార్మికులు తమ శ్రమతో అభివృద్ధికి పునాది వేస్తున్నారని కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారికి తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story