Karimnagar: కలెక్టర్‌తో ఎమ్మెల్యే సత్యం భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై చర్చ
Karimnagar: కరీంనగర్ జిల్లాలో యాసంగి వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కోరారు.
Karimnagar: కలెక్టర్‌తో ఎమ్మెల్యే సత్యం భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై చర్చ
Karimnagar: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటకు సంబంధించి వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతుల నుండి ఎటువంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం అధికారులను కోరారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకాడేతో సమావేశమైన ఆయన, రైతులు పండించిన వరి పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఆలస్యం, అనవసర నిబంధనలు, మిల్లర్ల నిర్లక్ష్యం వలన రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు.
మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులను వేధించే విధంగా ఎటువంటి షరతులు విధించకూడదని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగి, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం అధికారులకు సూచించారు.




