Malyala: తక్కలపల్లిలో విషాదం.. తిరుపతి గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా
Malyala: దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా తక్కలపల్లికి చెందిన గల్ఫ్ కార్మికుడు గోళ్లపెల్లి తిరుపతి గౌడ్ మృతి చెందారు.
Malyala: తక్కలపల్లిలో విషాదం.. తిరుపతి గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా
మల్యాల: ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన గోళ్లపెల్లి తిరుపతి గౌడ్ మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబానికి ఆధారంగా ఉన్న తిరుపతి గౌడ్ అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలో చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం తక్కలపల్లి గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల బాధను తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం తన వ్యక్తిగత సహాయంగా రూ.20,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం తరపున కూడా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,తిరుపతి గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగేలా, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల సహాయాలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.




