Kondagattu: కొండగట్టు అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం!
Kondagattu: తన పుట్టినరోజు సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
Kondagattu: కొండగట్టు అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం!
కొండగట్టు: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం తన పుట్టినరోజు సందర్భంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, చొప్పదండి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అలాగే తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




