Gangadhara: నాగిరెడ్డిపూర్‌లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనిఖీ
Gangadhara: గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ ఐకేపీ కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనిఖీలు.
Gangadhara: నాగిరెడ్డిపూర్‌లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనిఖీ
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ రైతుల సహకారంతో ఇప్పటివరకు 90 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని కూడా మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వమనే విషయాన్ని మరోసారి నిరూపించుకుందని అన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎవరు ఎంత బురద చల్లినా ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల కష్టానికి తగిన గౌరవం కల్పిస్తూ, వారి పంటకు సరైన మద్దతు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




