Karimnagar: కొండగట్టులో గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు!
Karimnagar: రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగి వర్షాలు కురవాలని కోరుతూ రేపు కొండగట్టులో గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.
Karimnagar: కొండగట్టులో గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు!
Karimnagar: తెలంగాణ రాష్ట్ర ప్రజల, రైతుల ఇబ్బందులు తొలగి అందరూ సభిక్షంగా ఉండాలని రేపు కొండగట్టులో గిరి ప్రదక్షణ చేపట్టినట్లు డిసీసీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా రైతుల ఇబ్బందులు తొలగి వర్షాలు సమృద్ధిగా కురుసి రాష్ట్రం బాగుండాలని గిరి ప్రదక్షణ చేపట్టినట్లు తెలిపారు.
కొండగట్టులో గిరి ప్రదక్షణ రేపు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుందని ఇందులో మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుల, మతాలకు అతీతంగా రాజకీయ పార్టీల కతీతంగా ఒక వర్గానికే కాకుండా అందరూ సమైక్యంగా పాల్గొని సకల జనుల హితం కోరి చేసే ఈ ప్రదక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామి నరసింహుడు, శివుడి ప్రతిరూపంగా వెలిశాడని భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన మన కొండగట్టు ఆంజనేయస్వామి కృపకు అందరూ పాత్రులు కావాలని కోరారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..
రైతుల ఇబ్బందులు తొలగి వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ చేపట్టే ఈ గిరి ప్రదక్షిణ లో కుల మతాలకతీతంగా రాజకీయాల కతీతంగా అందరూ పాల్గొని ఆంజ.నేయస్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం చొరవ చూపిస్తున్నారని అన్నారు. యాదాద్రి వరహాలోనే వేములవాడ, కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలను ముఖ్యమంత్రి అభివృద్ధి చేయడం కోసం మాట ఇచ్చారని కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.
రేపు చేపట్టే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని రైతుల క్షేమం కోసం అందరం స్వామివారిని వేడుకుందామన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే కురవాల్సిన వర్షాలు కురవక రైతులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తుందని కూడా ఇది గమనించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పక్షమేనని రైతులకు ఇబ్బందులు కలిగిన తక్షణమే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుందన్నారు.




