Karimnagar: కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకత ఉండాలి - ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 23 April 2026 3:49 PM IST
Karimnagar
X

Karimnagar: కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకత ఉండాలి - ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్ జిల్లా: చొప్పదండి మండలంలోని రుక్మాపుర్, కొలిమికుంట, భూపాలపట్నం, వెదురుగట్ట, ఆర్నకొండ, రాగంపేట్ గ్రామాలలో ప్యాక్స్ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం సరైన మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వడ్లను నేరుగా కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు.

రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతు శ్రేయస్సే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు రవాణా భారం తగ్గి సౌకర్యవంతంగా ధాన్యం విక్రయించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్యాక్స్ చైర్మన్లు, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story