Ramadugu: రామడుగు మోడల్ స్కూల్‌లో వంటశాల గదికి భూమి పూజ: టాపర్లను సన్మానించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Ramadugu: రామడుగు మోడల్ స్కూల్‌లో వంటశాల నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ. పదవ తరగతి టాపర్లకు సన్మానం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 11 May 2026 8:34 PM IST
Ramadugu
X

Ramadugu: రామడుగు మోడల్ స్కూల్‌లో వంటశాల గదికి భూమి పూజ: టాపర్లను సన్మానించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో వంటశాల గది నిర్మాణ పనులకు చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలలో పాల్గొని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించి సన్మానించారు. విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి వారి కృషిని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.

విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకోవాలని సూచించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story