Ramagiri: మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధు తీవ్ర విమర్శలు!
Ramagiri: మంథనిలో BRS పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మండిపడ్డారు. పార్టీ అండగా ఉంటుందన్నారు.
Ramagiri: మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధు తీవ్ర విమర్శలు!
బీఆర్ఎస్ కార్యకర్తల పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి పై తీవ్ర విమర్శలు చేసిన పుట్ట మధు.
మంథాని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ..... బీఆర్ఎస్ కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మంథని నియోజకవర్గ అభివృద్ధిని పక్కనబెట్టి, బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త పూదరి సత్యనారాయణ తల్లి పై కూడా కేసు నమోదు చేయడం దురదృష్టకరమని, 70 ఏళ్ల వృద్ధురాలిపై కేసు పెట్టించడం సిగ్గుచేటని అన్నారు.
అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు కోర్టుల్లో జడ్జీలతో చీవాట్లు తింటున్న పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఆ సమయంలో అక్రమ కేసులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీ కోసం పనిచేస్తూ అక్రమ కేసులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, కాలుకు ముళ్ళు గుచ్చితే పండితం తీస్తానాని, ఏ కార్యకర్తను ఒంటరిగా వదిలిపెట్టబోమని పుట్ట మధు స్పష్టం చేశారు.




