Metpally: మెట్‌పల్లి మండలంలో 82 మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు

Metpally: మెట్టుపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన 82 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 12 Nov 2026 4:51 PM IST
Metpally
X

Metpally: మెట్‌పల్లి మండలంలో 82 మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు

​మెట్టుపల్లి: మెట్టుపల్లి మండలానికి ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన 82 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ (మంజూరు పత్రాలు) లబ్ధిదారులకు అందజేశారు.

​గురువారం మెట్టుపల్లిలోని ఎంపీడీఓ (MPDO) కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన 82 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA