Karimnagar: చొప్పదండిలో రైతులపై అక్రమ కేసులు
Karimnagar: రైతులపై అక్రమ కేసులా? కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బహిరంగ సవాల్.. ధాన్యం కొనుగోళ్లపై చర్చకు రావాలని డిమాండ్.
Karimnagar: చొప్పదండిలో రైతులపై అక్రమ కేసులు
కరీంనగర్: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గం రైతులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ వారిని ఏడిపిస్తున్నడని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నేడు ప్రైవేటు హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అంటే రైతులపై కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చొప్పదండి ఎమ్మెల్యే సత్యం రైతుల మీద పగపడుతున్నారు అని ఆరోపించారు. దమ్ముంటే కొనుగోలు పై చర్చకు రావాలనీ ఎమ్మెల్యే సత్యం కు సవాల్ విసిరారు. పగలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు నిలదీస్తారని రాత్రి వేళ దొంగళ్లాగా వచ్చి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారనీ ఆరోపించారు. కేవలం రీల్స్ కొరకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని ఎద్దేవా చేసారు. లారెక్కి స్టంట్లు చేస్తున్నారు తప్ప రైతులకి ఒనగూర్చింది ఏమీ లేదన్నారు దమ్ముంటే నాపై కేసు పెట్టండి.
కానీ ఏమి తెలియని ప్రజలకు అన్నం అందిస్తున్న రైతులపై కేసులు పెట్టకండనీ పోలీసులకు విజ్ఞప్తి చేసారు.ధాన్యం కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేసే రైతులను ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేస్తున్నారని, రౌడీ లాగ వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు.
అన్నాడి దామోదర్ రెడ్డి, మహిపాల్ అనే రైతులపై కేసులు నమోదు చేశారు.8 మంది పై అక్రమ కేసులు పెట్టారనీ ఆవేదన వ్యక్తం చేసారు.చొప్పదండి లో నియంత పాలన కొనసాగుతుందన్నారు. స్తంబంపల్లి కరుణాకర్ అనే యువకునిపై అక్రమ కేసులు పెట్టీ 14 రోజులు జైల్లో పెట్టారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తో పాటు మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మెన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




