Karimnagar: కుట్రలు భగ్నం.. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్టును నిలిపివేసిన హైకోర్టు!
Karimnagar: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు నిలిపివేయడంపై సుంకె రవిశంకర్ స్పందించారు.
Karimnagar: కుట్రలు భగ్నం.. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్టును నిలిపివేసిన హైకోర్టు!
Karimnagar: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ స్పందిస్తూ, ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.
ఆయన మాట్లాడుతూ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా బోగస్ అని, దాన్ని చెత్తబుట్టలో వేయాల్సిందేనని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఏర్పాటుచేసిందని ఆరోపించారు. అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ కుట్రలు భగ్నమయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయలాంటిదని, రాష్ట్ర వ్యవసాయం మరియు నీటి అవసరాల పరంగా ఇది అత్యంత కీలకమని సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.




