Peddapalli: వారం రోజుల్లో రైతుభరోసా నిధులు: ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!
Peddapalli: హరీష్ రావు, కేసీఆర్ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడుతూ.. వారం రోజుల్లో ₹9వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు.
Peddapalli: వారం రోజుల్లో రైతుభరోసా నిధులు: ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!
పెద్దపల్లి: హరీష్ రావుకు రోజుకు 100 అబద్ధాలు ఆడందే కడుపు నిండదని అలాంటి అబద్ధాలతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాడని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మండిపడ్డారు.
స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తెలంగాణలో వర్షాలు పడక పంటలు పండక రైతులు ఇబ్బందులు పడితే చూసి ఆనందించే వాళ్లు కెసిఆర్ కుటుంబం అని ఎద్దేవా చేశారు.
అబద్ధాలు వాడడంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మించిన వాళ్లు తెలంగాణలో ఎక్కడ దొరకరున్నారు.
కాలేశ్వర ప్రాజెక్టు విషయంలో ప్రజలకు అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని, దీనిపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సలహాలు తీసుకొని రిపేర్లు చేస్తామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ పెద్ద వైఫల్యమని ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీశ్‌రావులే ఇంజనీర్లుగా మారి కట్టిన ఈ ప్రాజెక్టు కింద మూడు బ్యారేజీలు కొట్టుకుపోయాయని, దీని ద్వారా కనీసం 20 టీఎంసీల నీటిని కూడా ఎత్తిపోయలేదన్నారు.
ఎల్‌ఎమ్‌డి ప్రాజెక్టుపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసిందని, ₹21 వేల కోట్లతో 25 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసిందని తెలిపారు.
రాబోయే వారం రోజుల్లో రూ.9,000 కోట్లతో రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు విజయరమణారావు స్పష్టం చేశారు.
ఆధార రహిత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.




