Bavusaipet: బావుసాయిపేట పాఠశాలలో కోతుల బెడద.. భయాందోళనలో చిన్నారులు!
Bavusaipet: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట పాఠశాలలో కోతుల బెడద పెరగడంతో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని సోమవారం తల్లిదండ్రులు వాపోయారు.
Bavusaipet: బావుసాయిపేట పాఠశాలలో కోతుల బెడద.. భయాందోళనలో చిన్నారులు!
బహుసాపేట: బహుసాపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కోతుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో కోతులు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటకు వెళ్లాలన్నా, బాత్రూంకు వెళ్లాలన్నా విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్న పిల్లలు బాత్రూంకు వెళ్లే సమయంలో ఆయమ్మ తోడుగా ఉండాల్సి వస్తోందని తెలుస్తోంది. కోతులను గమనిస్తూ, వాటిని తరిమేందుకు ఉపాధ్యాయులు కూడా తమ విలువైన బోధనా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
పాఠశాల ఆవరణలోని చెట్ల కొమ్మలు తరగతి గదుల వరకు విస్తరించడంతో కోతులు సులభంగా క్లాస్ రూమ్‌లలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడిందని విద్యార్థులు పేర్కొంటున్నారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పాఠశాల ఆవరణలోకి విస్తరించిన చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు కోతుల బెడద నివారణకు తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




