Ganneruvaram: కన్నబిడ్డలా పిల్లి పిల్లను సాకుతున్న కోతి

Ganneruvaram: కరీంనగర్ జిల్లా మైలారం గ్రామంలో వింత ఘటన. పిల్లి పిల్లను తన బిడ్డలా సాకుతున్న కోతి.

ANJANEYULU, MANAKONDURU
Published on: 9 May 2026 10:07 AM IST
Ganneruvaram
X

Ganneruvaram: కన్నబిడ్డలా పిల్లి పిల్లను సాకుతున్న కోతి

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో ఓ వింత ఘటన స్థానికులను చోటు చేసుకుంది. గ్రామంలో ఓ కోతి చిన్న పిల్లి పిల్లను ఎత్తుకొని, గత కొన్ని రోజులుగా కోతి, పిల్లి పిల్లను తనతోనే ఉంచుకుంటూ గ్రామమంతా సంచరిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు పిల్లి పిల్లను కోతి నుంచి వేరుచేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. కోతి ఎవరైనా దగ్గరికి వస్తే అప్రమత్తమై పిల్లి పిల్లను గట్టిగా పట్టుకుని చెట్లపైకి ఎక్కిపోతుందని స్థానికులు చెబుతున్నారు. కోతి ప్రేమతో పిల్లి పిల్లను చూసుకుంటుండటంతో గ్రామస్తులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story