Yellareddypet: MRPS ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి ఖానాపురం లక్ష్మణ్
Yellareddypet: కోరుట్లపేటలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు, మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాల నిర్వహణపై ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ముఖ్య సమావేశం జరిగింది.
Yellareddypet: MRPS ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి ఖానాపురం లక్ష్మణ్
ఎల్లారెడ్డిపేట: మండలం కోరుట్లపేట గ్రామంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు "గో టు విలేజ్ – పార్టీ డేస్" కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని కోరారు.
మాదిగల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమ ఫలితంగానే రిజర్వేషన్లలో వర్గీకరణ సాధ్యమైందని, తెలంగాణ ప్రభుత్వం 9 శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని తెలిపారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిగ యువత ముందుకు సాగాలని, ఎమ్మార్పీఎస్ నూతన తరానికి అండగా నిలవాలని, ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, కుల పెద్దలు, ఎమ్మార్పీఎస్ నాయకులు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




