Jammikunta: మొక్కలు నాటడం ప్రతి పౌరుడి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో చైర్మన్

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

GANESH, JAMMIKUNTA
Published on: 8 July 2026 5:40 PM IST
Jammikunta
X

Jammikunta: మొక్కలు నాటడం ప్రతి పౌరుడి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో చైర్మన్

జమ్మికుంట: పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. మల్లికార్జున స్వామి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ప్రతి కౌన్సిలర్, ప్రతి కుటుంబం, ప్రతి మహిళ తమ ఇళ్ల పరిసరాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.తల్లి జన్మనిస్తే.

మొక్కలు పునర్జన్మ ఇస్తాయి" అనే సందేశంతో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పట్టణంలో పెరుగుతున్న జనాభా, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గృహాల ఆవరణల్లో అధిక సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు, అవి పెద్ద చెట్లుగా ఎదిగే వరకు సంరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాచర్ల రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఎల్‌ఆర్‌పీలు (CLRPs), ఆర్‌పీలు (RPs) తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story