Jammikunta: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ సమీక్ష!
Jammikunta: జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఐఆర్ ఓటరు సవరణ సమీక్షలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొన్నారు.
Jammikunta: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ సమీక్ష!
జమ్మికుంట: జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో RDO ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) సమీక్ష సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ , మున్సిపల్ కమిషనర్
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, ప్రతి అర్హుడైన ఓటరుకు అవకాశం కల్పించేలా స్థానిక కౌన్సిలర్స్, బీఎల్ఓలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆర్డీఓ సూచించారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మా మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో జమ్మికుంట పట్టణ పరిధిలోని 30 వార్డుల కౌన్సిలర్స్ బీఎల్ఓలతో కలిసి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఓటరును గుర్తించి, ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితాలో మిస్ కాకుండా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వంద శాతం విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, MRO, గౌరవ కౌన్సిలర్స్ సంబంధిత అధికారులు,BLO లు తదితరులు పాల్గొన్నారు.




