Jammikunta: నీటి వృధాను అరికట్టి ప్రజా ఉద్యమంగా మారుద్దాం చైర్మన్!
Jammikunta: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో జల్ శక్తి అభియాన్ లో భాగంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో జల ప్రతిజ్ఞ చేశారు.
Jammikunta: నీటి వృధాను అరికట్టి ప్రజా ఉద్యమంగా మారుద్దాం చైర్మన్!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నీటి రక్షణ పై జల ప్రతిజ్ఞ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడతానని,దానిని తెలివిగా ఉపయోగిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను,నీటిని సక్రమంగా వినియోగిస్తానని కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను,నేను నీటి ప్రతి చుక్కను సంరక్షిస్తాను 'జల్ శక్తి అభియాన్ : వర్షాన్ని పట్టుకోండి'ప్రచారాన్ని ప్రోత్సహించడంలో నా పూర్తి సహకారాన్ని అందిస్తాము.
నేను నీటిని ఒక అమూల్యమైన వనరుగా భావించి,ఆ అవగాహనతోనే దానిని ఉపయోగిసాను.నీటిని తెలివిగా ఉపయోగించి, వృధా చేయకుండా ఉండేలా నా కుటుంబ సభ్యులను, స్నేహితులను పోరుగువారిని ప్రోత్సహిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.ఈ గ్రహం మనది,మనమే దీనిని కాపాడి,మన భవిష్యత్తును సురక్షితం చేసుకోగలము.
కలిసికట్టుగా, మనం జల ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మారుద్దాం. అని ప్రతిజ్ఞ చేసి పట్టణ ప్రజలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నీరు పొదుపుగా వాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి రాజిరెడ్డి,TPO శ్రీధర్,సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, వార్డు ఆఫీసర్స్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




