Jammikunta: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్

Jammikunta: జమ్మికుంట పట్టణంలో ఇచ్చిన మాట ప్రకారం వినాయక మండపం నిర్మించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్. చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపిన 24వ వార్డు ప్రజలు.

GANESH, JAMMIKUNTA
Published on: 12 Sept 2026 9:58 PM IST
Jammikunta
X

Jammikunta: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన చెల్లెలు మొలుగు ప్రణీత గెలిచిన తర్వాత విగ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకొనుటకు మండపం నిర్మించాలని వార్డు ప్రజలు కోరగా తప్పకుండా రానున్న

విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలకు మండపం నిర్మాణం చేయిస్తామని నాడు మాట ఇచ్చి నేడు ఇచ్చిన మాట ప్రకారం మండప నిర్మాణం చేయించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ చైర్మన్ కి ధన్యవాదములు తెలిపిన వార్డు ప్రజలు.

ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి.రాము,అఖిల్,రాజేష్,సాగర్,రాజేష్,వీరస్వామి,పాపయ్య,నాని,తేజ,శ్రీరామ్,సురేష్,పొచాలు,తదితరులు పాల్గొన్నారు..

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA