Sircilla: చంద్రంపేట చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు!
Sircilla: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట చౌరస్తా వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి తెలిపారు.
Sircilla: చంద్రంపేట చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు!
Sircilla: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట చౌరస్తా వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి తెలిపారు. స్థానిక 12వ వార్డు పరిధిలోని సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డు, సిరిసిల్ల–కోనరావుపేట ప్రధాన రహదారులు కలిసే చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.
స్థానిక కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు ఈ సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో చైర్పర్సన్ చౌరస్తా వద్ద పరిస్థితులను పరిశీలించారు. రోడ్డు డివైడర్‌పై పెరిగిన చెట్ల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు వాహనదారులకు సరిగ్గా కనిపించడం లేదని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించారు. వాహనదారులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేలా చర్యలు తీసుకుంటామని స్థానికులకు తెలిపారు.
అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, చంద్రంపేట చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వాహనదారులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, రోడ్డు ప్రమాదాల నివారణలో మున్సిపల్ శాఖ నుంచి అందించాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండటంతో పాటు వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించుకుని అవసరమైన మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. బాటసారులు సైతం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా రోడ్డు దాటాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు, మాజీ కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వార్డు అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, నర్మెట ప్రభు, తిరుపతి రెడ్డి, మల్లేశం, వీరగోని చందు, కత్తెర రాజు, పరుశరాములు, వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




