Karimnagar: త్రస్థాయిలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీలు!

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ క్రిస్టియన్ కాలనీ, జ్యోతినగర్లలో పర్యటించి ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 20 July 2026 10:39 PM IST
Karimnagar
X

Karimnagar: త్రస్థాయిలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీలు!

కరీంనగర్: ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న " సర్ " ప్రక్రియలో భాగంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పలు డివిజన్లలో పర్యటించారు. నగరంలోని క్రిస్టియన్ కాలనీతో పాటు జ్యోతినగర్ ప్రాంతాల్లో తనిఖీ చేసి పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణ తీరు పై బూత్ లెవెల్ అధికారులు, సూపర్ వైజర్, మానీటరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్ లైన్ వివరాల నమోదు, తదితర విషయాల పై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్ లైన్ పోర్టల్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నగర ప్రజలు ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓ లకు సహకరించాలన్నారు. పూరించిన ఎన్యుమరేషన్ ఫారాలను వెను వెంటనే బిఎల్ఓలకు తిరిగి అందించి ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేస్కోవాలన్నారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ రమణారెడ్డి, బిఎల్ఓ లు, సూపర్ వైజర్లు, మానిటరింగ్ అధికారులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story