Karimnagar: నిరంతరాయంగా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు: కమిషనర్!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏబీసీ కమిటీ సమావేశం జరిగింది. ప్రజల భద్రత కోసం వీధి కుక్కల బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.
Karimnagar: నిరంతరాయంగా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు: కమిషనర్!
కరీంనగర్: ప్రజల బద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంటీ బర్థ్ కంట్రోల్ ఆపరేషన్లను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కమీషనర్ అధ్యక్షతన జంతు జనన నియంత్రణ (ఏబీసి) మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బొమ్మకల్ ప్రాంతంలోని ఏబిసి సెంటర్‌లో నిర్వహిస్తున్న వీధి కుక్కల కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) శస్త్రచికిత్సల పురోగతి, శస్త్రచికిత్స అనంతరం వాటి సంరక్షణ, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, కుక్కలకు గుర్తింపు (ఇయర్ మార్కింగ్) శస్త్రచికిత్స అనంతరం వాటిని తిరిగి సంబంధిత ప్రాంతాల్లో విడుదల చేయడం తదితర అంశాలపై కమిటీ సభ్యులు సమీక్షించారు.
ఎనిమల్ బర్థ్ కంట్రోల్ రూల్ 2023 ప్రకారం జంతు సంక్షేమ ప్రమాణాలను పాటిస్తూ సమర్థవంతంగా అమలు చేయడం, శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్, పోస్ట్ ఆపరేటీవ్ కేర్, రికార్డుల నమోదు తదితర అంశాల పై సూచనలు స్వీకరించారు. అనంతరం కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ కమీటి సమావేశంలో నగరపాలక సంస్థ ఆద్వర్యంలో చేపడుతున్న జంతు సంరక్షణ, జనన నియంత్రణ పై క్లుప్తంగా వివరించారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో వీది కుక్కల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా ప్రణాళిక బద్దంగా ఎనిమల్ చట్టం నియమ నిబంధనలను అనుసరించి ఆంటీ రేబీస్ కంట్రోల్ ఆపరేషన్లు వాటి సంరక్షణ చర్యలు చేపడున్నట్లు తెలిపారు. రేబిస్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టి డాగ్స్ బైట్ ను నియంత్రించేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ప్రజల బద్రతను దృష్టిలో పెట్టుకొని జనన నియంత్రణ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ జే సువార్త, ఏహెచ్ విపిసి అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్, కేఏకేఏ సెక్రటరీ డా, జి కొమురయ్య, వెటర్నరీ ఆఫీసర్ దుర్గాప్రసాద్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ సుమన్, ఎస్ పి సీఏ సుమన్, వెటర్నరీ డాక్టర్ అనూష, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




