Mustabad: ముస్తాబాద్‌లో ఘోరం.. బాలమిత్ర స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారి మృతి!

Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని బాలమిత్ర పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

V ATCHUTH RAO, PALERU
Published on: 24 Jun 2026 9:53 PM IST
Mustabad
X

Mustabad: ముస్తాబాద్‌లో ఘోరం.. బాలమిత్ర స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారి మృతి!

ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలమిత్ర పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సాధారణంగా పాఠశాలకు వెళ్లిన చిన్నారి తరగతి గదిలోనే అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే సమాచారం అందించారు. అయితే చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట మృతదేహంతో నిరసన చేపట్టారు. ఘటనకు గల అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.

అనంతరం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

చిన్నారి మృతి కారణాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉండగా, పోలీసుల దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

V ATCHUTH RAO, PALERU

V ATCHUTH RAO, PALERU

Next Story