Kamanpur: ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
Kamanpur: కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు తండ్రి సాంబయ్య మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పరామర్శించారు.
Kamanpur: ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
పెద్దపల్లి జిల్లా: కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వై నాలా రాజు తండ్రి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి శీను బాబు ఆదేశాల ప్రకారం ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ వైనాల సాంబయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
సాంబయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రాగడ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ వెంట కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ముత్తారం సింగిల్ విండో అధ్యక్షులు యాదగిరి రావు, ముత్తారం మండల మైనార్టీ శాఖ అధ్యక్షులు వాజిద్ పాషా, వెన్నెల రాజు తోపాటు తదితరులు ఉన్నారు.




