Huzurabad: హుజురాబాద్‌లో వికలాంగులకు స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ

Huzurabad: హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్‌లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ లబ్ధిదారులకు ట్రై మోటరైజ్డ్ స్కూటీలు మరియు ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 21 April 2026 5:03 PM IST
Huzurabad
X

Huzurabad: హుజురాబాద్‌లో వికలాంగులకు స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ

Huzurabad: హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్ లో వికలాంగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ట్రై మోటరైజ్డ్ స్కూటీలను, ఎలక్ట్రికల్ ఆటోను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య కరీంనగర్ జిల్లా జమ్మికుంట హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రాష్ట్రం మొత్తం 8000ల ఉపకరణాలు అందజేస్తున్నామని పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగుల కోసం 1500 స్కూటీలు ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకే సంవత్సరంలో 2000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలను అందజేశామని తెలిపారు.

ఈ ఉపకరణాల ద్వారా వారిలో మనోస్థర్యాన్ని నింపడమే కాకుండా వారికి ఆర్థిక భరోసాను స్వయం ఉపాధినీ కల్పిస్తున్నామని అన్నారు. వాహనాలు పొందిన వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డ్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story