Sircilla: సిరిసిల్ల 3వ వార్డులో ఘనంగా ముత్యాల పోచమ్మ బోనాలు!

Sircilla: 3వ వార్డులో ఘనంగా శ్రీశ్రీ ముత్యాల పోచమ్మ తల్లి బోనాలు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పణ.

KALEEM, SIRICILLA
Published on: 2 Aug 2026 12:49 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల 3వ వార్డులో ఘనంగా ముత్యాల పోచమ్మ బోనాలు!

Sircilla: 3వ వార్డులో వైభవంగా శ్రీశ్రీ ముత్యాల పోచమ్మ తల్లి బోనాలు.. భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించిన మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి

స్థానిక 3వ వార్డులో శ్రీశ్రీ ముత్యాల పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి 3వ వార్డు ప్రజలతో కలిసి రంగురంగుల ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలివెళ్లారు.

డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జైజైధ్వానాల మధ్య మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు మోసుకుంటూ ఊరేగింపులో పాల్గొనగా, కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి శ్రీశ్రీ ముత్యాల పోచమ్మ తల్లికి సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story