Peddapalli: ధర్మారంలో మహిళ అనుమానాస్పద మృతి - మృతదేహం వెలికితీత!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో లక్ష్మి అనుమానాస్పద మృతి. హడావుడిగా అంత్యక్రియలు చేయడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.
Peddapalli: ధర్మారంలో మహిళ అనుమానాస్పద మృతి - మృతదేహం వెలికితీత!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన గంగాధర లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది దీంతో కుటుంబ సభ్యులు హడావుడిగా శనివారం రోజున అంత్యక్రియలు చేయడంతో, కాలనీవాసులకు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. లక్ష్మీ మరణం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా అత్త కోడల మధ్య తరచు గొడవలు జరిగేవి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లడం జరిగింది. ఇట్టి విషయాన్ని సింగిరెడ్డి సరోజన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగింది.
అనంతరం సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిన్న రాత్రి సుమారు 7గంటల 20 నిమిషాలకు గంగాధర లక్ష్మి అనుమానస్పద మృతి చెందిందని వాళ్ల వాడలో ఉన్నటువంటి సింగిరెడ్డి సరోజన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు మృతదేహాన్ని వెలికి తీసి తహసిల్దార్ డి.శ్రీనివాస్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కార్తీక్ సమక్షంలో పోస్టుమార్టం చేయడం జరిగింది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.




