Peddapalli: ఉపాధి హామీ పనులు వదిలేసి సమావేశానికా?: ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు

Peddapalli: మంథని మండలం నాగపెల్లిలో ఉపాధి హామీ కూలీలను పనులు నిలిపివేసి సమావేశానికి తరలించడంపై వివాదం. ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యుడు బొమ్మకంటి సతీష్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 7 May 2026 9:00 PM IST
Peddapalli: ఉపాధి హామీ పనులు వదిలేసి సమావేశానికా?: ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు
X

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగపెల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయంలో కూలీలను సమావేశానికి తరలించడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్‌ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యుడు బొమ్మకంటి సతీష్ గురువారం మంథని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

గ్రామంలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న సమయంలో 67 మంది కూలీలను పనులు నిలిపివేసి వ్యవసాయ శాఖ అధికారుల సమావేశానికి పంపించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. పని ప్రదేశంలో ఉండాల్సిన కూలీలను ఇతర కార్యక్రమాలకు తరలించడం వల్ల పనులకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు, ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పాటించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story