Kalva Srirampur: జాఫర్‌ఖాన్‌పేట శ్రీ నాగదేవత ఆలయంలో వైభవంగా నాగుల చవితి!

Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట శ్రీ నాగదేవత ఆలయంలో నాగుల చవితి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు, అన్నదానం ఘనంగా జరిగాయి.

KONDAL, SULTANABAD
Published on: 13 Nov 2026 11:36 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: జాఫర్‌ఖాన్‌పేట శ్రీ నాగదేవత ఆలయంలో వైభవంగా నాగుల చవితి!

పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట గ్రామంలో శ్రీ నాగదేవత ఆలయంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ నాగదేవత అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.​ ఆలయ నిర్వాహకులు సంగ కొమురయ్య, సంగ గట్టయ్య భక్తుల సహకారంతో 2002 నవంబర్ 29న ఈ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠాపన చేశారు.

నాటి నుంచి ప్రతి ఏటా నాగుల చవితి పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహిస్తారు నాగుల చవతి సందర్భంగా ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వస్తి పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన జరిపి నాగదేవత, నాగశక్తి, సంతాన నాగదేవతలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు.

అదేవిధంగా గౌరీ, మహాలింగ, నందీశ్వర దేవతలకు అభిషేకాలు, నవగ్రహ హోమాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఉత్సవాల్లో సర్పంచ్ యాదగిరి జోత్స్న శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD