Peddapalli: హరిహర క్షేత్రంలో వైభవంగా నాగుల పంచమి వేడుకలు!

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ హరిహర క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు. నాగదేవతకు పాలాభిషేకాలు, నాగుల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 Aug 2026 10:28 AM IST
Peddapalli
X

Peddapalli: హరిహర క్షేత్రంలో వైభవంగా నాగుల పంచమి వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ హరిహర క్షేత్రంలో నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో వచ్చే నాగపంచమి లో ఆలయంలో ఉదయం నుంచే ఆలయానికి భక్తులు విశేషంగా తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. నాగదేవతకు భక్తులు జలాభిషేకం, పాలాభిషేకాలు సేవించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగుల పుట్ట వద్ద పాలు, గుడ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

​ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాట్లాడుతూ.. హరిహర క్షేత్రంలో కొలువైన నాగదేవత ఎంతో మహిమాన్వితమైనదని, భక్తులు కొలిచిన కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవమని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా ఉదయాన్నే నాగదేవతకు విశేష అభిషేకాలు, దివ్యాంబర అలంకరణలు చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం గంగాజలంతో పవిత్ర అభిషేకం పూర్తి చేసి, ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించినట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli