Vemulawada: వేములవాడలో భక్తిప్రపత్తుల నడుమ నాగుల పంచమి వేడుకలు1

Vemulawada: వేములవాడలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు. భీమేశ్వరాలయంలో సుహాసినుల ప్రత్యేక పూజలు. పాము పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు.

BABU, VEMULAWADA
Published on: 17 Aug 2026 10:16 AM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడలో భక్తిప్రపత్తుల నడుమ నాగుల పంచమి వేడుకలు1

Vemulawada: నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నాగదేవతలను పూజించారు. సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు మార్కండేయనగర్ సాయిబాబా దేవాలయం తదితర ప్రాంతాల్లో మహిళలు పుట్ట వద్ద పాలు పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని నాగదేవతలను ప్రార్థించారు. ఆలయాల్లో సుహాసినిలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నాగుల పంచమి పర్వదినాన్ని ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని తెలిపారు. నాగదేవతలను పూజించడం వల్ల కుటుంబంలో శుభం, సౌభాగ్యం కలుగుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA