Karimnagar: శరన్నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబైన నగునూరు శ్రీ దుర్గా భవాని ఆలయం!
Karimnagar: కరీంనగర్ శివారులోని నగునూరు శ్రీ దుర్గా భవాని ఆలయంలో అక్టోబర్ 10 నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు.
Karimnagar: శరన్నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబైన నగునూరు శ్రీ దుర్గా భవాని ఆలయం!
Karimnagar: కరీంనగర్ శివారులోని నగునూరు గ్రామంలో విరాజిల్లుతున్న ప్రసిద్ధ శ్రీ పరివార సమేత శ్రీ దుర్గా భవాని దేవాలయం (శంకర మఠం) శరన్నవరాత్ర మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఫౌండర్ , దేవాలయ వంశపారంపర్య చైర్మన్ వంగల లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు రోజున దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగల లక్ష్మణ్ మాట్లాడారు.
శృంగేరి పీఠాధిపతుల పట్టు వస్త్రాలతో ఘనంగా శోభాయాత్ర...
శ్రీశ్రీశ్రీ శృంగేరి పీఠాధిపతులచే అందించబడిన పట్టు వస్త్రాలు మంత్ర అక్షింతలతో ఈ పవిత్ర శోభాయాత్ర ప్రకాశం గంజ్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నుండి బయలుదేరి శ్రీ దుర్గా భవాని ఆలయం వరకు అత్యంత వైభవంగా కొనసాగుతుందని తెలిపారు.
అమ్మవారికి 8 కిలోల బంగారు ఆభరణాలు - భక్తుల
భాగస్వామ్యానికి పిలుపు నగునూరు శ్రీ దుర్గా భవాని ఆలయం అత్యంత మహిమాన్విత శక్తి ఆలయం కావడంతో, అమ్మవారి మూల విగ్రహమునకు 8 కిలోల బంగారంతో సంపూర్ణ బంగారు ఆభరణాలు (కవచాలు) తయారు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించిందని, సమస్త భక్తులు అమ్మవారి కోసం తయారు చేస్తున్న బంగారు ఆభరణాల మహా యజ్ఞంలో భాగస్వాములై, తమకు తోచిన విధంగా కనీసం 1 గ్రాము బంగారం సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మవారికి సమర్పించే బంగారం వల్ల ఆత్మశుద్ధి, పితృదోష నివారణ, సంతాన వృద్ధి, శ్రీ మహాలక్ష్మీ కటాక్ష సిద్ధి, సర్వపాప విముక్తి అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు .
శరన్నవ రాత్రి మహోత్సవాల పూర్తి దైవ కార్యం.. (అక్టోబర్ 10 నుండి 21 వరకు). అమ్మవారికి సంపూర్ణ అభిషేకం, ధ్వజారోహణం. దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకల వివరాలను తెలియజేస్తూ అక్టోబర్ 11, 2026 (ఆదివారం): ఉదయం 6:30 నుండి గురు వందనం, గోపూజ, పుణ్యాహవాచనం, గ్రహారాధన, కలశస్థాపన, చతుష్షష్టిచారపూజ, చండీహోమం, మంగళహారతి, కన్యా సువాసినీ పూజలు బ్రాహ్మీ అలంకరణ (హంస వాహనంతో) ,ప్రత్యేక అలంకరణలు
అక్టోబర్ 12 - 15 : సోమవారం మాహేశ్వరి అలంకరణ (నంది వాహనం), మంగళవారం కుమారీ అలంకరణ (నెమలి వాహనం), బుధవారం వైష్ణవీ అలంకరణ (గరుడ వాహనం), గురువారం లలిత త్రిపుర సుందరి అలంకరణ .
విశేష పూజలు (అక్టోబర్ 16 - 20): శుక్రవారం సరస్వతి అలంకరణ (మూలానక్షత్ర పూజ - హంస వాహనం), శనివారం ఇంద్రాణీ అలంకరణ (గజ వాహనం), ఆదివారం దుర్గా భవాని అలంకరణ (దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ - సింహ వాహనం), సోమవారం అన్నపూర్ణ అలంకరణ (మహార్నవమి), మంగళవారం విజయదుర్గా అలంకరణ (విజయదశమి - సాయంత్రం 5 గంటలకు శమీపూజ ,6 గంటలకు రామ్‌లీల). ..
అక్టోబర్ 21, 2026 (బుధవారం): అర్ధనారీశ్వర అలంకరణ, సింహ , నంది వాహన సేవలతో పాటు, ఉదయం 10 గంటలకు దుర్గాభవాని సుందరేశ్వరుల పట్టాభిషేకం రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించబడతాయని వివరించారు.
సమస్త భక్తులు ఈ దేవి నవరాత్రి ఉత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠం పరివార సమేత శ్రీ దుర్గా భవాని దేవాలయం ఆలయ ఫౌండర్ , దేవాలయ వంశపారంపర్య చైర్మన్ వంగల లక్ష్మణ్ తో పాటు శృంగేరి పీఠం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిఏ మురళి కోరారు.




