Sircilla: శ్రీశైల మల్లన్నకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ!

Sircilla: చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తాను నేసిన అరుదైన అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి సమర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 14 July 2026 9:31 PM IST
Sircilla
X

Sircilla: శ్రీశైల మల్లన్నకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ రూపొందించిన అగ్గిపెట్టెలో పట్టే అరుదైన పట్టుచీరను శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రమేష్ నాయుడుకు ప్రత్యేకంగా ఆ పట్టుచీరను అందజేశారు.

చేనేత కళారత్న అవార్డు గ్రహీత దివంగత నల్ల పరంధాములు గారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్ల విజయ్ కుమార్, అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో పాటు చిన్న అగ్గిపెట్టె శాలువాను కూడా స్వామివారికి సమర్పించారు.

ఈ పట్టుచీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 అంగుళాలు కాగా, కేవలం 200 గ్రాముల బరువుతో రూపొందించడం విశేషం. సంప్రదాయ చేనేత నైపుణ్యానికి ఆధునిక కళాత్మకతను జోడిస్తూ ఈ ప్రత్యేక కళాఖండాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.

తన తండ్రి నల్ల పరంధాములు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ చేనేత రంగంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నానని, ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నానని విజయ్ కుమార్ చెప్పారు. త్వరలో మరో అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆవిష్కరించాలనే సంకల్పంతో స్వామివారి ఆశీర్వాదం కోసం శ్రీశైలం వచ్చినట్లు వెల్లడించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story