Gangadhara: ఐఐటి పరీక్షల్లో లక్ష్మీదేవిపల్లి విద్యార్థుల జోరు!

Gangadhara: గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి నరేంద్ర విద్యాలయం విద్యార్థుల ఘనత. ఐఐటి టాలెంట్ పరీక్షల్లో 6వ, 7వ తరగతి విద్యార్థులకు 6 గోల్డ్ మెడల్స్.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 24 April 2026 6:35 PM IST
Gangadhara
X

Gangadhara: ఐఐటి పరీక్షల్లో లక్ష్మీదేవిపల్లి విద్యార్థుల జోరు!

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలోని నరేంద్ర విద్యాలయం హై స్కూల్ విద్యార్థులు ఐ ఐ టీలో గోల్డ్ మెడల్స్ సాధించినట్లు పాఠశాల యాజమాన్యం గంగాధర రాజేశం, గుజ్జుల గోపాల్ రెడ్డి తెలిపారు. బ్రెయిన్ మ్యాపింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐ ఐ టి కోర్సులో 6వ, 7వ తరగతి విద్యార్థులకు పాఠశాల స్థాయిలో కోచింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా అకాడమీ సంస్థ ఆయా తరగతులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగా 6వ తరగతిలో ఏ. మేఘన్, జీ. వాస్విక్, జ్.సాయిప్రతిష్ లు గోల్డ్ మెడల్స్ సాధించగా, 7వ తరగతిలో ఏ. అక్షిత, డి.సంజన, ఏ. అభిక్ లు గోల్డ్ మెడల్ సాదించారు. ఇట్టి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో అందించారు.ఆర్. నిహాల్ గౌడ్ కు ప్రశంశ పత్రం అందించారు.

మొదటి సరిగా 6వ 7వ తరగతులకు ప్రవేశ పెట్టిన ఐ ఐ టి కోర్సు లో గోల్డ్ మెడల్స్ సాధించడంపై పాఠశాల యజమాన్యం, తల్లితండ్రులు, అధ్యాపక బృందం, విద్యార్టీని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం మిగితా తరగతులకు ఐ ఐ టి కోర్సు తో పాటు అబకాస్, వేదిక్ మ్యాస్, డిజిటల్ తరగతులు ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక తో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు. ఈకార్యక్రమంలో సబ్జెక్టు బోధకులు డి. కరుణాకర్, టి. అరుణ్, అధ్యాపకాబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story